భారతదేశం, మే 7 -- Hansika Guardian Review: హ‌న్సిక (Hansika )హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ (Kollywood) మూవీ గార్డియ‌న్ ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ హార‌ర్ మూవీకి శ‌బ‌రి గురు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?

అప‌ర్ణ‌ను (హ‌న్సిక‌) చిన్న‌త‌నం నుంచి దుర‌దృష్టం వెంటాడుతుంటుంది. ఏది కోరుకున్నా అది జ‌ర‌గ‌దు. చివ‌ర‌కు దేవుడి హార‌తి తీసుకోవాల‌ని అనుకున్నా అప‌ర్ణ‌ మొక్క‌డానికి చేతులు పెట్ట‌గానే దీపం ఆరిపోతుంది. ఆమె ల‌వ్‌కు బ్రేక‌ప్ ప‌డిపోతుంది. అంద‌రూ ఆమెను అన్‌ల‌క్కీ అప‌ర్ణ అని పిలుస్తుంటారు. ప్రాజెక్ట్ వ‌ర్క్‌లో భాగంగా క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌లో ఉన్న బిల్డింగ్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది అప‌ర్ణ‌. అక్క‌డ ఆమెకు క్రిస్ట‌ల్ (మెరుపు రంగు రాయి) దొరుకుతుంది. అప్ప‌టి నుంచి అప‌ర్ణ జీవిత‌మే మారిపోతుంది.

ఆమె ఏద...