భారతదేశం, ఏప్రిల్ 25 -- Guppedantha Manasu Today Episode: మ‌హేంద్ర కార‌ణంగా తాను ప‌డ్డ అవ‌మానాలు భ‌రించ‌లేక మ‌ను అత‌డిని గ‌న్‌తో షూట్ చేసిన‌ట్లుగా అనుప‌మ క‌ల కంటుంది. ఆ క‌ల కార‌ణంగా భ‌యంతో ఒక్క‌సారిగా నిద్ర‌లో నుండి మేల్కొంటుంది. వ‌సుధార నిజం బ‌య‌ట‌పెడితే క‌ల‌లో జ‌రిగిన‌ట్లే మ‌హేంద్ర‌ను మ‌ను నిజంగానే షూట్ చేస్తాడు కావ‌చ్చున‌ని అనుప‌మ భ‌య‌ప‌డుతుంది.

త‌న‌కు వ‌చ్చిన క‌ల మొత్తం వ‌సుధార‌కు చెప్పేస్తుంది. మ‌ను తండ్రి మ‌హేంద్ర‌నే అనే నిజం ఎప్ప‌టికీ బ‌య‌ట‌పెట్టొద్ద‌ని వ‌సుధార‌ను రిక్వెస్ట్ చేస్తుంది. మ‌నుకు త‌న తండ్రిపై చాలా ద్వేషం ఉంద‌ని, నిజం తెలిస్తే ఖ‌చ్చితంగా ఆవేశంతో మ‌నును షూట్ చేసినా చేస్తాడ‌ని వ‌సుధార‌తో అంటుంది అనుప‌మ‌.

మ‌నుకు వ‌సుధార ఫోన్ చేస్తుంది. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసిన మ‌ను లిఫ్ట్ చేయ‌డు. ఆమె కాల్స్ అవైడ్ చేస్తుంటాడు. ఇంత‌లోనే ...