భారతదేశం, ఏప్రిల్ 24 -- Guppedantha Manasu Today Episode: వ‌సుధార‌కు ఏంజెల్ ఫోన్ చేస్తుంది. తాను, విశ్వ‌నాథం ద‌త్త‌త కార్య‌క్ర‌మానికి రావ‌డం లేద‌ని చెబుతుంది. మ‌ను క‌న్న తండ్రి ఉండ‌గా...మ‌హేంద్ర అత‌డిని ద‌త్త‌త తీసుకోవ‌డం విశ్వ‌నాథం భ‌రించ‌లేక‌పోతున్నాడ‌ని, అందుకే తాము ద‌త్త‌త కార్య‌క్ర‌మానికి దూరంగా ఉండాల‌నుకుంటున్న‌ట్లు చెప్పి ఫోన్ క‌ట్ చేస్తుంది. వ‌సుధార క‌న్వీన్స్ చేసే ప్ర‌య‌త్నం చేసినా ఏంజెల్ విన‌దు.

ఫోన్‌లో రిషి ఫొటో ఓపెన్ చేసిన వ‌సుధార‌...మ‌ను మీ బ్ర‌ద‌ర్ అంట అని ఫొటోతో చెబుతుంది. మ‌నును ఒప్పించి ద‌త్త‌త కార్య‌క్ర‌మానికి తీసుకుర‌మ్మ‌ని త‌న‌కు మ‌హేంద్ర చెప్పిన మాట‌ల‌ను గుర్తుచేసుకుంటుంది. మ‌రోవైపు త‌న తండ్రి ఎవ‌రో త‌ల్లి చెబితేనే కానీ ద‌త్త‌త కార్య‌క్ర‌మానికి రాన‌ని మ‌ను ప‌ట్టుప‌ట్టిన సంగ‌తిని త‌లుచుకుంటుంది. మ‌ను క‌న్న తండ్రి మ‌హే...