భారతదేశం, ఏప్రిల్ 27 -- Guppedantha Manasu Today Episode: మ‌నును ద‌త్త‌త తీసుకునేందుకు మ‌హేంద్ర అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ద‌త్త‌త కార్య‌క్ర‌మం ముగుస్తుండ‌గా పోలీసులు వ‌చ్చి అడ్డుకుంటారు. రాజీవ్‌ను హ‌త్య చేసిన కేసులో మ‌నును అరెస్ట్ చేస్తారు. మ‌నును పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో అనుప‌మ క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. రాజీవ్‌ను మ‌నునే హ‌త్య చేసి కేసును త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికే ద‌త్త‌త కార్య‌క్ర‌మానికి వ‌చ్చాడ‌ని దేవ‌యాని నింద‌లు వేస్తుంది. ఆమె మాట‌ల‌తో మ‌హేంద్ర ఫైర్ అవుతాడు. నిజానిజాలు తెలియ‌కుండా నింద‌లు వేయ‌ద్ద‌ని అంటాడు.

మ‌ను మ‌ర్డ‌ర్ చేశాడు అంటే ఫ‌ణీంద్ర న‌మ్మ‌డు. శైలేంద్ర కూడా మ‌నుపై సానుభూతి చూపిస్తాడు. మ‌నుది మ‌ర్డ‌ర్ చేసే క్యారెక్ట‌ర్ కాద‌ని అంటాడు. మ‌ను హంత‌కుడు కాద‌ని, ఇది అత‌డిపై ప‌డిన నింద మాత్ర‌మేన‌ని ఫ‌ణీంద్ర అంటాడు. కానీ భ‌ర్త‌, కొడు...