భారతదేశం, మే 1 -- Guppedantha Manasu Today Episode: చేయ‌ని త‌ప్పుకు త‌న కొడుకు మ‌ను జైలుకు వెళ్ల‌డం అనుప‌మ త‌ట్టుకోలేక‌పోతుంది. తాను చేసిన పొర‌పాట్ల వ‌ల్ల త‌న కొడుకు జీవితం క‌ష్టాల‌మ‌యం అవుతుంద‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. మ‌ను అవ‌మానాలు, బాధ‌ల పాలు కావ‌డానికి తానే కార‌ణ‌మ‌ని బాధ‌ప‌డుతుంది. మ‌ను కొడుకుగా తాను అంగీక‌రించి ఉంటే ఈ క‌ష్టాలు ఉండేవి కావ‌ని అనుకుంటుంది. ఆమెను వ‌సుధార‌, పెద్ద‌మ్మ ఓదార్చుతారు.

మ‌నును జైలు నుంచి విడిపించే బాధ్య‌త త‌న‌ది అని అనుప‌మ‌కు మాటిస్తాడు మ‌హేంద్ర‌. మ‌నుషుల ప్రాణాలు తీసే మ‌న‌స్త‌త్వం మ‌నుది కాద‌ని, అత‌డి గురించి త‌న‌కు బాగా తెలుసున‌ని అనుప‌మ‌తో అంటాడు మ‌హేంద్ర‌. అక్క‌డే ఉన్న పెద్ద‌మ్మ‌....నీది, మ‌నుది ర‌క్త సంబంధం లాంటి బంధ‌మ‌ని మ‌హేంద్ర‌తో అంటుంది. ఇన్‌డైరెక్ట్‌గా మ‌ను అత‌డి కొడుకే అనే నిజం మ‌హేంద్ర‌కు చెబ...