భారతదేశం, మే 3 -- Guardian OTT: హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ హార‌ర్ మూవీ గార్డియ‌న్ ఓటీటీలో రిలీజైంది. శుక్ర‌వారం నుంచి సింప్లీసౌత్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ మాత్ర‌మే సింప్లీసౌత్ ఓటీటీలో ఈ హార‌ర్ మూవీని చూడొచ్చు.

ఇండియ‌న్ ఆడియెన్స్ గార్డియ‌న్‌ మూవీని చూడాలంటే మ‌రో వారం వెయిట్ చెయ‌క త‌ప్ప‌ద‌ని స‌మాచారం. మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ హార‌ర్ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిసింది. అమెజాన్ ప్రైమ్‌లో త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

గార్డియ‌న్ మూవీకి శ‌బ‌రి గురు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మార్చి 8న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈమూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఫ‌స్ట్ వీక్‌లోనే థియేట‌ర్ల‌లో క‌నిపించ‌కుండాపోయింది.

హ‌న్సిక యాక్టింగ్ మిన‌హా క‌థ...