తెలంగామ,హైదరాబాద్, మే 19 -- Food Safety Inspections in Hyderabad: హైదరాబాద్ లో ఎక్కడ చూసిన హోటళ్లు, రెస్టారెంట్లు భారీగా కనిపిస్తుంటాయి. ఆహార ప్రియులు కూడా అంతే స్థాయిలో అక్కడికి వెళ్తుంటారు. ఇష్టమైన ఆహారాలను తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక వీకెండ్స్ వస్తే.. చాలా కుటుంబాలు రెస్టారెంట్లకు వెళ్లాల్సిందే అన్నట్లు ఉంటుంది.

పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లకు వెెళ్తే ఆహార ప్రమాణాలను పాటిస్తారనే భావన అందరిలోనూ ఉంటుంది. అయితే చాలాచోట్ల అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. ఆకస్మికంగా చేస్తున్న తనిఖీల్లో వారి డొల్లతనం బయటపడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

శనివారం(మే 18)వ తేదీన హైదరాబాద్ లోని లక్డీకాపుల్ పరిధిలోని పలు హోటళ్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్(తెలంగాణ) బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి.

లక్డీకాపు...