భారతదేశం, ఫిబ్రవరి 9 -- Eagle Sequel: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ న‌డుస్తోంది. కొత్త సినిమాల‌కు క్లైమాక్స్‌ల‌లో సీక్వెల్స్‌ను అనౌన్స్ చేస్తూ ఆడియెన్స్‌ను మేక‌ర్స్ స‌ర్‌ప్రైజ్ చేస్తోన్నారు. ఈ సీక్వెల్ ట్రెండ్‌లో ర‌వితేజ ఈగ‌ల్ కూడా చేరింది. ఈగ‌ల్‌కు పార్ట్ 2 రాబోతున్న‌ట్లు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. సీక్వెల్ టైటిల్‌ను కూడా ప్ర‌క‌టించారు. ఈగ‌ల్ 2 - యుద్ధ‌కాండ పేరుతో సీక్వెల్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించి ర‌వితేజ అభిమానుల‌ను ఖుషిచేశారు. ఈగ‌ల్ రిజ‌ల్ట్‌ను అనుస‌రించి ఈ సీక్వెల్ షూటింగ్‌పై తొంద‌ర‌లోనే అప్‌డేట్ రానున్న‌ట్లు స‌మాచారం. రవితేజ షూట‌ర్ పాత్ర‌ను కంటిన్యూ చేస్తూ మ‌రో డిఫ‌రెంట్ పాయింట్‌తో ఈగ‌ల్ 2 తెర‌కెక్కే అవ‌కాశం ఉంద‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈగ‌ల్ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది.రై...