భారతదేశం, ఏప్రిల్ 30 -- Devil Review: పూర్ణ‌, విదార్థ్‌, త్రిగుణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ మూవీ డెవిల్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీకి కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు మిస్కిన్ సోద‌రుడు ఆథియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మిస్కిన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే...

అలెక్స్ (విదార్థ్‌) ఓ బిజినెస్‌మెన్‌. హేమ‌తో (పూర్ణ‌) పెద్ద‌లు అత‌డి పెళ్లిని జ‌రిపిస్తారు. పెళ్లికిముందు నుంచే అలెక్స్ త‌న ఆఫీస్‌లోనే ప‌నిచేసే ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ సోఫియాతో (శుభ‌శ్రీ) రిలేష‌న్‌షిప్‌లో ఉంటాడు. సోఫియా మాయ‌లో ప‌డి హేమ‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంటాడు. ఓ రోజు అలెక్స్ కోసం లంచ్ తీసుకొని అత‌డి ఆఫీస్‌కు వ‌స్తుంది హేమ‌. అలెక్స్‌, సోఫియా ఆఫీస్‌లోనే రొమాన్స్ చేసుకుంటూ హేమ కంట‌ప‌డ‌తారు.

భ‌ర్త‌పై కోపంతో ఆఫీస్ నుంచి ఇంటికి వ‌స్తోన్న టైమ్‌లో...