భారతదేశం, ఫిబ్రవరి 20 -- Deepika Padukone: తనకు పిల్లలను కనాలని ఉందని ఈ మధ్యే కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని వార్తలు వస్తున్నాయి. దీపికా తల్లి కాబోతోందని ఆమె సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ది వీక్ రిపోర్ట్ వెల్లడించింది. అంతేకాదు.. ఆమె ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ రెండో ట్రైమెస్టర్ లో ఉందని కూడా ఆ రిపోర్ట్ చెప్పడం విశేషం.

తనకు, రణ్‌వీర్ కు పిల్లలంటే చాలా ఇష్టమని, తాము కూడా ఓ ఫ్యామిలీని మొదలు పెట్టే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకోన్ చెప్పింది. అయితే అంతలోపే ఆమె తల్లి కాబోతోందన్న వార్తలు వస్తుండటం గమనార్హం. ఈ మధ్యే బాఫ్టా అవార్డుల కార్యక్రమంలో ఆమె ప్రజెంటర్ గా పార్టిసిపేట్ చేసింది. అయితే ఈ రిపోర్టు చెప్పినట్లు ఆమె రెండో ట్రైమెస్టర్ లో ఉన్నట్లుగా మాత్రం కనిపించలేదు.

దీ...