భారతదేశం, మార్చి 17 -- CM Revanth Reddy : 'ఇవాళ ఉదయమే గేట్ ఓపెన్ చేశాం కాసేపట్లో మీరే చూస్తారు'... పార్టీలో చేరికలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల పాలనపై హైదరాబాద్ (Hyderabad)లో మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్(BJP BRS) పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, నా రాజకీయం ఏంటో చూపిస్తానన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender), ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy)ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ వి...