భారతదేశం, ఏప్రిల్ 27 -- Chunduru Police Station Review: జోజు జార్జ్‌, కుంచ‌కో బోబ‌న్‌, నిమిషా స‌జ‌య‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ న‌య‌ట్టు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమాను చండూరు పోలీస్ స్టేష‌న్ పేరుతో ఆహా ఓటీటీ తెలుగులోకి డ‌బ్ చేసింది. ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీకి మార్టిన్ ప్రక్క‌ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

సునీత (నిమిషా స‌జ‌య‌న్‌) కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తుంటుంది. బిజు అనే లోక‌ల్ రౌడీతో సునీత‌కు గొడ‌వ‌లు ఉంటాయి. సునీత‌కు ఏఎస్ఐ మ‌ణియ‌న్ (జోజు జార్జ్‌), కానిస్టేబుల్ ప్ర‌వీణ్ మైఖేల్ (కుంచ‌కోబోబ‌న్‌) స‌పోర్ట్‌గా నిలుస్తారు. స్టేష‌న్‌కు వ‌చ్చిన బిజును ప్ర‌వీణ్, మైఖేల్ అరెస్ట్ చేస్తారు. అదే టైమ్‌లో ఆ ఏరియాలో ఉప‌ ఎన్నిక‌లు జ‌రుగ...