భారతదేశం, మే 10 -- Chitram Choodara Review: వ‌రుణ్ సందేశ్‌, శీత‌ల్ భ‌ట్ హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం చూడ‌ర మూవీ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ ల‌వ్‌స్టోరీగా ద‌ర్శ‌కుడు ఆర్ ఎస్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఈ మూవీని రూపొందించాడు. అల్ల‌రి ర‌విబాబు, శివాజీరాజా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే.

కొత్త‌ప‌ట్ట‌ణం అనే ఊళ్లో రంగారావు (కాశీవిశ్వ‌నాథ్‌), మొద్దు(ధ‌న్‌రాజ్‌)ల‌తో క‌లిసి బాలా (వ‌రుణ్ సందేశ్‌) నాట‌కాలు వేస్తుంటాడు. ప్ర‌జ‌ల‌ను పీడిస్తోన్న రౌడీకి వ్య‌తిరేకంగా బాలా ఓ నాట‌కం వేస్తాడు. ఆ నాట‌కంలో బాలా న‌ట‌న చూసి సినిమా ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ మ్ల‌లేషం (శివాజీరాజా) ఇంప్రెస్ అవుతాడు. తాము తీయ‌బోతున్న కొత్త సినిమాలో బాలాకు హీరో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ ఇస్తాడు.

ఆ సినిమా ఆఫ‌ర్ కోసం హైద‌రాబా...