భారతదేశం, ఏప్రిల్ 27 -- Chandrabose: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా శబరి మే 3న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్‌కు ఏడు రోజులే స‌మ‌యం ఉండ‌టంతో ప్ర‌మోష‌న్స్ స్పీడు పెంచేశారు. ఇప్ప‌టికు రిలీజ్ చేసిన టీజ‌ర్‌తో పాటు పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

తాజాగా ఈ మూవీలోని అనగనగా ఒక కథలా...అనే పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు. ఈ పాట‌ను దిగ్గ‌జ గాయ‌ని చిత్ర ఆల‌పించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాటను విడుదల చేశారు.

'అనగనగా ఒక కథలా...' పాటకు సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్ర‌ఫీ సమకూర్చారు. తన సతీమణి కొరియోగ్రఫీ చేసిన పాటను చంద్రబోస్ తన చేతుల మీదుగా విడుదల చేయడం ఇదే తొలిసారి.

పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ...'"అనగనగా ఒక కథలా... పాటలో గోపీసుంద‌ర్ మ్యూజిక్‌, ర...