భారతదేశం, మే 8 -- భార్యాభర్తల బంధం చాలా దృఢమైనది. చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు వైవాహిక జీవితంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య సంబంధం సంప్రదాయం, విలువలు, గౌరవంతో ముడిపడి ఉంటుంది. అంతేకాదు ఇది రెండు ఆత్మల మధ్య విడదీయరాని బంధం కూడా. వివాహం నిజం, నిజాయితీపై నిర్మితమవుతుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో అబద్ధాలు, మోసం కలగలిసిన సంబంధం ఎన్నటికీ నిలవదని చెప్పారు. భార్యాభర్తల మధ్య బంధంలోకి అలాంటివి రావడానికి ఎప్పుడూ అనుమతించవద్దు.

బంధం తెగిపోయినప్పుడు శబ్దం ఎక్కువగా ఉండదు. కానీ మనసుకు, మెదడుకు బాధ కలిగించే నొప్పి మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి భరించడం చాలా కష్టం. పెళ్లికి ముందు భాగస్వాములు కొన్ని విషయాలు తెలుసుకోవాలని చాణక్యుడు చెప్పాడు. మంచి గుణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకుంటే మీ జీవితం స్వర్గధామం అవుతుంది. ...