భారతదేశం, ఫిబ్రవరి 6 -- చాణక్యుడు గొప్ప వ్యక్తి. సమాజానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు చెప్పాడు. కుటుంబ జీవితం సంతోషగా ఉండాలంటే కొన్ని విషయాలను పాటించాలని చెప్పుకొచ్చాడు. జీవితానికి అవసరమైన అన్ని విధానాలను రూపొందించాడు. చాణక్యుడి సూత్రాలను ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. పెళ్లి గురించి కొన్ని విషయాలను తెలిపాడు. వివాహం అనేది పవిత్రమైన బంధం. మీరు ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత, మీరు మరణం వరకు వారితో జీవించాలి. జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు దూరదృష్టి చాలా ముఖ్యం.

కుటుంబం సాఫీగా సాగాలంటే భార్యాభర్తల సహకారం చాలా ముఖ్యం. ఒక్కరు సరిగా లేకున్నా కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది. భార్యాభర్తలు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే కుటుంబం నాశనమైపోతుందని చాణక్యుడు చెప్పాడు.

కుటుంబంలో సంతోషం, దుఃఖం రావడం సహజం. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చ...