భారతదేశం, మే 7 -- Brahmamudi May 7th Episode: కావ్య‌పై నోరు జారుతుంది రుద్రాణి.ఆమెను అవ‌మానిస్తుంది. రుద్రాణిపై సుభాష్ ఫైర్ అవుతాడు. ఆస్తి కోస‌మే ప‌డుంటుంద‌ని అప‌నింద‌వేస్తావా? నా కోడ‌లిని ప‌ల్లెత్తు మాట కూడా అనే హ‌క్కు కూడా నీకు లేద‌ని రుద్రాణికి క్లాస్ ఇస్తాడు.

త‌ల్లి మాట‌కు క‌ట్టుబ‌డి ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌ప‌డ‌తాడు రాజ్‌. దాంతో రాజ్‌పై కోపం పెంచుకున్న అప‌ర్ణ అత‌డితో డిన్న‌ర్ చేయ‌డానికి అంగీక‌రించ‌దు. తాను ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డానికి రెండు రోజులే గ‌డువు ఉంటుంది. ఈ గ‌డువు పూర్త‌య్యేలోపు నీ మ‌న‌సును క‌ష్ట‌ప‌డితే నువ్వు ఎంతలా బాధ‌ప‌డ‌తావో నేను ఊహించ‌గ‌ల‌ను. ఆ బాధ నీకు ఉండ‌కూడ‌దంటే నువ్వు నాతో క‌లిసి ఇప్పుడు డిన్న‌ర్ చేయాల‌ని అప‌ర్ణ‌ను రిక్వెస్ట్ చేస్తాడు రాజ్‌.

ఎప్ప‌టిలా మ‌న సంతోషంగా ఉండాలంటే నువ్వు ఆ బిడ్డ‌ను వ‌దిలేయాల‌న...