Hyderabad, మే 10 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో బిడ్డ తల్లితో రాజ్ పెళ్లి చేయిస్తానని అపర్ణ అంటుంది. కావ్య మాత్రం ఏం సుఖం పొందింది. ఇష్టం లేని భర్తతో ఎలా ఉంటుంది. మరోదానితో బిడ్డను కని తెచ్చిన వాడితో ఎలా బతుకుతుంది. నేను కావ్యకు అన్యాయం చేయట్లేదు. ఆ దేవుడే ఆమెకు అన్యాయం చేశాడు. ఆమె తల్లి బలవంతంగా పెళ్లి చేసి అన్యాయం చేసింది. ఇప్పుడు నేను కావ్యకు న్యాయం చేస్తాను అని సుభాష్‌తో అపర్ణ చెబుతుంది.

కావ్యను రాజ్ జీవితంలో నుంచి పంపించి.. రాజ్ కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేయిస్తాను. అప్పుడు వాడికి న్యాయం జరుగుతుంది. బిడ్డకు, బిడ్డ తల్లికి న్యాయం జరుగుతుంది. ఇక కావ్య పరిస్థితి అంటారా. ఆమె కొత్తగా కోల్పోడానికి ఏం లేదు. అత్తగారి ఇల్లు తప్పా. ఆమె భవిష్యత్ కోసం ఎంత ఆస్తి అయినా రాసిద్దాం. ఇలా చేయిద్దామనే రాజ్‌ను ...