భారతదేశం, మే 8 -- Brahma Anandam Movie: టాలీవుడ్ సీనియ‌ర్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం లీడ్ రోల్‌లో ఓ కొత్త మూవీ రాబోతోంది. ఈ సినిమా టైటిల్‌ను బుధ‌వారం రివీల్ చేశారు. ఈ సినిమాకు బ్ర‌హ్మ అనందం అనే పేరును ఖ‌రారు చేశారు. ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో బ్ర‌హ్మానందంతో పాటు ఆయ‌న త‌న‌యుడు రాజా గౌత‌మ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు.

ఈ సినిమాలో తండ్రీకొడుకులు తాతామ‌న‌వ‌ళ్లుగా క‌నిపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ పేర్కొన్నారు. బ్ర‌హ్మ ఆనందం మూవీకి ఆర్‌వీఎస్ నిఖిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ సినిమాలో వెన్నెల‌కిషోర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప్రియా వ‌డ్ల‌మాని, ఐశ్వ‌ర్య హోల్ల‌క్క‌ల్ హీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్నారు.

బ్ర‌హ్మ ఆనందం మూవీ టైటిల్‌ను ఓ వీడియో ద్వారా డిఫ‌రెంట్‌గా అనౌన్స్‌చేశారు. ఈ వీడియోలో బ్ర‌హ్మానందం, వెన్నెల‌ కిష...