భారతదేశం, మే 8 -- Bheemili Beach : మీరు విశాఖలో ఉంటున్నా లేదా సమ్మర్ లో అలా విశాఖ ట్రిప్ వేసినా భీమిలి బీచ్ ను చూడడం మాత్రం మర్చిపోకండి. సాయంత్రం సమయంలో అలా బీచ్ లో కాసేపు గడిపితే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ లో నైట్ స్టే చేస్తే ఆ అనుభూతి మరింత అద్భుతంగా ఉంటుంది. భీమిలి లేదా భీమునిపట్నం వైజాగ్ సమీపంలోని ఒక ఫిషింగ్ గ్రామం. ఇది ఒకప్పటి డచ్ వాళ్ల సెటిల్మెంట్. భీమిలి బీచ్‌లు చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. సముద్రం వంపులో భీమిలి బీచ్ ఎంతో అందంగా కనిపిస్తుంది.

భీమిలి బీచ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో డచ్ స్థావరం, శిథిలమైన కోట, బెల్ ఆఫ్ ఆర్మ్స్, 17వ శతాబ్దానికి చెందిన డచ్ స్మశానవాటిక, హోలాండర్ అవశేషాలు చూడవచ్చు. మీరు బీచ్‌కి వెళ్లే దారిలో ఎర్ర మట్టి దిబ్బలు కనిపిస్తాయి. దీనిని 'ఎర్ర ఇసుక దిబ్బలు' అని పిలుస్తారు. ఎర్రమట్టి దిబ్బలను వారసత...