భారతదేశం, ఏప్రిల్ 25 -- Balakrishna: ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో గ‌త రెండు ద‌శాబ్దాలుగా టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతోన్నాడు ఏఆర్ రెహ‌మాన్‌. త‌న మ్యూజిక్‌తో ఇండియ‌న్ సినిమా ఖ్యాతిని ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్తాడు. స్టార్ హీరోల స్థాయిక‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకునే ఏకైక మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రెహ‌మాన్ నిలిచాడు. రెహ‌మాన్ మ్యూజిక్‌కు తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కువ‌గా త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల ద్వారానే రెహ‌మాన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాడు.

తెలుగులో రెహ‌మాన్ మ్యూజిక్ అందించిన‌స్ట్రెయిట్ సినిమాల సంఖ్య ప‌దిలోపే ఉన్నాయి. రెహ‌మాన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తెలుగులోకి బాల‌కృష్ణ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. బాల‌కృష్ణ హీరోగా కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన నిప్పుర‌వ్వ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స‌మ‌కూర్చాడు...