భారతదేశం, మే 8 -- AB Venkateswararao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేయాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తనను రెండోసారి సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‍లో సవాల్ చేశారు. దీనిపై గతంలో వాదనలు పూర్తి కావడంతో క్యాట్ తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ఈ పిటిషన్ పై తీర్పునిచ్చింది. వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయండం న్యాయ విరుద్దమని క్యాట్ అభిప్రాయపడింది. ఆయనను వెంటనే సర్వీస్ లోకి తీసుకుని రావాల్సిన ఎరియర్స్ మొత్తం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏబీవీ సస్పెన్షన్ చట్ట విరుద్దమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని క్యాట్ అభిప్రాయపడింది.

టీడీపీ ప్రభుత్వంలో రక్షణ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోప...