భారతదేశం, ఏప్రిల్ 24 -- Aavesham OTT: ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన ఆవేశం మూవీ థియేట‌ర్ల‌లో వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఫ‌హాద్ ఫాజిల్ కెరీర్‌లో ఈ మైలురాయిని చేరుకున్న ఫ‌స్ట్ మూవీగా రికార్డ్ నెల‌కొల్పింది. ఈ ఏడాది మంజుమ్మేల్ బాయ్స్‌, ప్రేమ‌లు, ది గోట్‌లైఫ్‌ త‌ర్వాత మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన నాలుగో మూవీగా ఆవేశం రికార్డ్ క్రియేట్ చేసింది. . గ్యాంగ్‌స్ట‌ర్ కామెడీ డ్రామా క‌థాంశంతో రొమాంచం ఫేమ్ జీతూ మాధ‌వ‌న్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. కథ‌, డైరెక్ట‌ర్ టేకింగ్‌తో పాటు రంగా అనే గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో ఫ‌హాద్ ఫాజిల్ బాడీలాంగ్వేజ్‌, కామెడీ టైమింగ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నాయి.

థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోన్న ఈ మూవీ అనుకున్న‌దానికంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆవేశం మూవీ ఓటీటీ హ‌క్క...