భారతదేశం, మార్చి 12 -- చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమీ తన మొదటి ఎలక్ట్రిక్ వాహన డెలివరీలను మార్చి చివరి నాటికి ప్రారంభించనుంది. ఈ విషయాన్ని షావోమీ (Xiaomi) మంగళవారం వెల్లడించింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన షావోమీ, తమ ఉత్పత్తుల జాబితాలోకి టాబ్లెట్స్, స్మార్ట్ వాచ్ లు, హెడ్ ఫోన్స్ తో పాటు కొత్తగా ఎలక్ట్రిక్ కార్లను కూడా చేర్చింది

చైనాలోని బీజింగ్ కు చెందిన షావోమీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి తన ప్రవేశాన్ని 2021 లో ప్రకటించింది. నాటి నుంచి మార్కెట్లోకి వినియోగదారులకు అత్యంత అనుకూలమైన ఎలక్ట్రిక్ కారు ను అందుబాటు ధరలో అందించాలని ప్రయత్నిస్తోంది. షావోమీ (Xiaomi) నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు 'ఎస్ యూ 7 (SU7)'ను మార్చి 28న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ లీ జున్ చైనీస్ సోషల్ మీడియా సైట...