భారతదేశం, మే 4 -- Replacing phone: టెక్నాలజీ వేగంగా ముందుకు సాగుతోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్ (smart phone) మార్కెట్లోకి వస్తున్నాయి. కొత్త ఫోన్ కొనాలని ఉన్నా.. ఏళ్ల క్రితం కొన్న స్మార్ట్ ఫోన్ బాగానే నడుస్తుంది కదా అన్న ఆలోచనలో ఉంటాం. అయితే, మీరు స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలో.. మీ ఫోనే చెబుతుంది. మీ ఫోన్ ఇచ్చే సంకేతాలను గుర్తించాలి అంతే..

మీ ఫోన్ (smart phone) స్లోగా మారుతున్నట్లయితే, అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం. కొత్త అప్ డేట్స్ ను, కొత్త ఫీచర్స్ ను ఉపయోగించలేకపోతున్నట్లయితే, కొత్త ఫోన్ కు మారడం బెటర్. యాప్స్ ఓపెన్ చేయడం లేట్ అవుతున్నా, ఫోన్ ల్యాగ్ అవుతున్నా.. ఫోన్ ను మార్చాల్సిందే. అంతేకాదు, అదే పాత ఫోన్ (smart phone) వాడుతున్నట్లయితే, సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బందులు రావచ్చు.

స్మ...