భారతదేశం, మే 4 -- NEET UG 2024: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2024) ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 5, 2024, ఆదివారం రోజు నిర్వహిస్తోంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలను శనివారం ఎన్టీఏ విడుదల చేసింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో పేర్కొన్న డ్రెస్ కోడ్ ను కూడా నీట్ యూజీ 2024 (NEET UG 2024) రాస్తున్న అభ్యర్థులు పరిశీలించాల్సి ఉంటుంది. పరీక్ష సజావుగా నిర్వహించడంలో ఏజెన్సీకి సహాయపడేందుకు డ్రెస్ కోడ్ ఆదేశాలను విడుదల చేశారు. ఎన్టీఏ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం..

నీట్ యూజీ 2024 (NEET UG 2024) పరీక్షను మే 5వ తేదీ ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు సింగిల్ షిఫ్ట్ లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 557 నగరాల్లోని వివిధ కేంద్రాల్లో 24 లక్షల...