భారతదేశం, మే 4 -- Kotak Mahindra Bank Q4 results: ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ 2024 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ నికర లాభం రూ.4,133 కోట్లు అని ప్రకటించింది. ఇది గత సంవత్సరం క్యూ 4 తో పోలిస్తే 18 శాతం వృద్ధి అని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23)లో కోటక్ బ్యాంక్ రూ.3,496 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY24) లో కొటక్ మహింద్ర మొత్తం ఆదాయం రూ.15,285 కోట్లకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది రూ.12,007 కోట్లుగా ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సర ఫలితాలను పరిశీలిస్తే, కొటక్ మహింద్ర బ్యాంక్ (Kotak Mahindra Bank) 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.10,939 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 26 శాతం పెరిగ...