భారతదేశం, ఏప్రిల్ 28 -- ICSE 10th result 2024 date and time : ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షా ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ). ఫలితాలు ప్రకటించిన తర్వాత, విద్యార్థులు తమ 10, 12వ తరగతి స్కోర్లను.. results.cisce.org లో చెక్​ చేసుకోవచ్చు. ఐసీఎస్​ఈ ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారు? అన్న విషయంపై ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ మే మొదటి వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. గత ఏడాది 2023లో.. 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు మే 13న విడుదలయ్యాయి.

ఈ ఏడాది ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 28 వరకు, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న జరగాల్సిన 12వ తరగతి కె...